Tuesday, January 21, 2025

ఇంటర్‌లో సత్తా చాటిన ఉడుత నక్షత్ర

- Advertisement -
- Advertisement -

చొప్పదండి: ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉడుత నక్షత్ర ఉత్తమ ప్రతిభను కనబరిచి ఎంపీసీ విభాగంలో 983 మార్కులను సాధించి సత్తా చాటింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన గుణశేఖర్ భార్గవి దంపతుల కుమార్తె నక్షత్ర. కరీంనగర్ లోని ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల ఎంపీసీ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదివింది. నక్షత్ర తల్లిదండ్రులు ఆయిల్ మిల్, లేడీస్ సంపోరియంలో వ్యాపారం చేసుకుంటూ తన కుమార్తెను చదివించడంతో నక్షత్ర ప్రణాళిక బద్ధంగా చదివి ఎంపీసీ విభాగంలో మొత్తం 1000 మార్కులకు గాను 983 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభను కనబరిచింది.

సివిల్స్ లో కూడా రాణిస్తా: ఉడుత నక్షత్ర 
కష్టపడి చదివి సివిల్స్ లో రాణించేందుకు కృషి చేస్తానని నక్షత్ర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తానని భవిష్యత్తులో సివిల్స్ లో రాణించి పేదలకు తన వంతు సాయం చేస్తానని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News