Wednesday, January 22, 2025

ఈ సారి ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహిస్తాం

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌లో పంచాంగ శ్రవణం
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Ugadi celebrations very grandly

 

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాన్ని ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కల్యాణ మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ఆలయ పరిసరాల్లో వెదురు తడికలతో కూడిన చలువ పందిళ్లను నిర్మించాలని మంత్రి సూచించారు.

ఈసారి భక్తుల సమక్షంలో….

మరోవైపు ఏప్రిల్ 2వ తేదీన శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రెండు సంవత్సరాలు కొవిడ్ నేపథ్యంలో ఆలయ ప్రాంగణం లోనే కోవిడ్ నిబంధనలతో శ్రీరాముని కల్యాణ వేడుకలను, నిరాడంబరంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహించామని, ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కన్నులపండుగగా భక్తుల సమక్షంలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News