Wednesday, January 22, 2025

ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

దుక్కి దున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతున్న….

మన తెలంగాణ/ గుడిహత్నూర్: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని శనివారం మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల వ్యాప్తంగా రైతన్నలు ఉదయాన్నే తమ తమ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి భూమాతకు, ఎడ్లకు ప్రత్యేక పూజలు చేసి తమ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఆలయాల్లో ప్రజలు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉగాది పచ్చడిని సేవించాలన్నారు. మండల కేంద్రంలోని పురాతన శివాలయంతో పాటు ఉమ్రి(బి) గ్రామ పంచాయతీ పరిధిలోని రామాలయంలో పండితులు శుభకృత్ నామ సంవత్సర నూతన పంచాంగాన్ని భక్తులకు చదివి వినిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News