Thursday, January 23, 2025

ఉగాది పోస్టర్ల సందడి

- Advertisement -
- Advertisement -

Ugadi posters
ఉగాది పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు కొత్త పోస్టర్లతో సందడి చేశాయి. పలువురు స్టార్లు డిఫరెంట్ లుక్‌తో దర్శనమిచ్చి ప్రేక్షకులు, అభిమానులను మురిపించారు. పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’ ఈ సంవత్సరం విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రాలలో ఒకటి. వేసవిలో సినిమా అభిమానులకు ‘సూపర్ స్పెషల్’ ట్రీట్‌ను అందించడానికి ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర నిర్మాతలు సరికొత్త యాక్షన్- ప్యాక్డ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ పోస్టర్‌లో మహేశ్ బాబుపై గూండాలు ఆయుధాలతో దాడికి సిద్ధపడుతుండగా ‘సూపర్ స్టార్’ తన బెల్ట్ తీస్తూ వారిపై దాడికి సిద్ధంగా వున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. వివిధ సందర్భాల్లో ప్రత్యేక పోస్టర్లతో ‘ఎఫ్‌౩’ టీమ్ వస్తోంది. ఉగాది కోసం ఫ్యామిలీ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, వారు సినిమాలోని ప్రధాన తారాగణం ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఎఫ్3’లో భార్య బాధితులుగా కనిపించే వెంకటేష్, వరుణ్ తేజ్ చేతిలో మెగాఫోన్ లు పట్టుకొని తమ కుటుంబాన్ని భయపెట్టడం ఆసక్తికరంగా ఉంది.

ఈ పోస్టర్‌లో వెంకటేష్, వరుణ్‌తేజ్‌తో పాటు రాజేంద్ర ప్రసాద్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, సునీల్, వెన్నెల కిషోర్ ఉన్నారు. మే 27న థియేటర్లలో నవ్వుల హంగామా చేయడానికి ‘ఎఫ్‌౩’ కుటుంబం సిద్ధంగా ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని కమర్షియల్ హంగులతో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఎఫ్3’ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా మొదటి సింగిల్ పంచెకట్టును ఏప్రిల్ 6న సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన పోస్టర్‌లో నాని తన విదేశీ పర్యటన యుఎస్‌ఎలోని సుందరమైన లొకేషన్‌లను ఆస్వాదిస్తూ, కారు డోర్‌లోంచి తల బయట పెట్టి పైకి చూస్తూ నవ్వుతూ కనిపించాడు. నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. అంటే సుందరానికి చిత్రం జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

ఉగాదికి ఉస్తాద్ రామ్ పోతినేని స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాపో అభిమానులకు పండగ తీసుకొచ్చాడు. ఆయన స్టైలిష్ పోలీస్ లుక్ అదుర్స్ అని అంతా అంటున్నారు. రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ’ది వారియర్’ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల కానుంది. ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటున్న యంగ్ హీరో నాగ శౌర్య మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించబోయే కొత్త చిత్రాన్ని నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టితో చేస్తున్నారు. పవర్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన కథను నాగ శౌర్య కోసం దర్శకుడు సిద్ధం చేశాడు. కమర్షియల్ సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని- ఉగాది సందర్భంగా ప్రకటించారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్.

అతను టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శనివారం తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బింబిసార చిత్రాన్ని ఆగస్ట్ 5న విడుదల చేస్తున్నారు. యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని. కొత్త దర్శకుడు కార్తిక్ శంకర్‌ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఉగాది సందర్భంగా మొదటి పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News