Monday, December 23, 2024

ప్రతి ఆది ఉగాదే

- Advertisement -
- Advertisement -

శిశిరం నుండి వసంతం వైపా
చీకటి నుండి వెలుతురు వైపా
స్తబ్ధత నుండి చేతన వైపా
వైరం నుండి స్నేహం వైపా
మోడుల నుండి చిగురుల వైపా
సంతాపం నుండి సంతోషం వైపా
అజ్ఞానం నుండి జ్ఞానం వైపా
అధః పాతాళం నుండి అంతరిక్షం వైపా
చెలిమి కలిమి కలిసొస్తే
ప్రేమ బలిమి తోడుంటే
దుఃఖం అయినా
దూరం అయినా
నిశీధి అయినా
నిరాశ అయినా
అదే అదే కద ఉగాది
అక్కడె కద నీ అసలైన మజిలీ

కొత్త ఆశలు కొత్త అనుభవాలు
కొత్త భావాలు కొత్త బాధ్యతలు
కొత్త అభిరుచులు కొత్త ఆలోచనలు

కొత్త పొందికలు కొత్త పోకడలు
కలబోసి ప్రకాశిస్తే
విరబూసి గుబాళిస్తే
ప్రతి మాటా కోయిల పాటవుతుంది
ప్రతి స్వప్నం నిజమై ఎదురొస్తుంది
ప్రతి నవ్వు పువ్వై విరబూస్తుంది
ప్రతి తలపు చెరుకై తీపౌతుంది
ప్రతి పూనిక లక్షం చేరుస్తుంది
ప్రతి జగతీ ప్రగతిని సాధిస్తుంది
ప్రతి ఆదీ ఉగాదిగ భాసిస్తుంది

పి.వి. ఆచార్య ఉమాశశి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News