- Advertisement -
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నానని రాష్ట్రపతి తెలుగులో ట్వీట్ చేశారు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ తెలుగులో ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అదేవిధంగా కొత్త సిజెఐగా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ ఎన్వీ రమణ కూడా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -