- Advertisement -
న్యూఢిల్లీ : అప్పులిచ్చి దారికి తెచ్చుకోవడం లేదా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం పద్ధతిని చైనా పాటిస్తోంది. ఇప్పుడు ఉగాండా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అప్పు తీర్చలేదనే కారణంతో చైనా స్వాధీనం చేసుకుంది. 2015 లో చైనాకు చెందిన ఎక్స్‌పోర్టుఇంపోర్ట్ బ్యాంకు నుంచి ఉగాండా 207 మిలియన్ డాలర్లను (దాదాపు రూ. 15,000 కోట్లు ) అప్పుగా తీసుకుంది. ఆ అప్పును తీర్చక పోవడంతో ఎంటెబ్బే అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు మరికొన్ని ఆస్తులను చైనా స్వాధీనం చేసుకుంది.
- Advertisement -