Monday, December 23, 2024

ఉగాండాలో గేసెక్స్ చేస్తే మరణ శిక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్వలింగ లైంగిక సంబంధాలపై ఉగాండా ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ తూర్పు ఆఫ్రికా దేశంలో ఇప్పటికీ హోమోసెక్కువాలిటీ చట్టవిరుద్ధం. తాజాగా ఉగాండా పార్లమెంట్ మంగళవారం ఆమోదించిన బిల్లు ప్రకారం గే సెక్స్ చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించ వచ్చు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేవలం ఫాక్స్ ఒడోయిఒయివెలోవో మాత్రమే మాట్లాడారు. ఫాక్స్ ఒడోయి ఒయివెలోవో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ చట్టం ప్రకారం నేరస్థులు జీవితఖైదు లేదా మరణశిక్ష అనుభవించవలసి ఉంటుందన్నారు. ఈ బిల్లు దేశాధ్యక్షుడు ముసేవేని వద్దకు వెళ్తుందని, మునేవేని దీన్ని తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చునని తెలిపారు. ఉగాండాలో ఈ బిల్లుకు ప్రజామద్దతు ఎక్కువగానే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News