Monday, December 23, 2024

డిగ్రీ మధ్యలో మానేసినా సర్టిఫికెట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : డిగ్రీ కోర్సుల్లో ఇక నుంచి క్రెడిట్ విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యుజిసి) పేర్కొంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను యుజిసి సోమవారం విడుదల చేసింది. మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్‌కు యుజిసి అవకాశం కల్పించింది. విద్యార్థి ఇష్టానుసారం డిగ్రీలో చేరడం, బయటకు వెళ్లడానికి వీలు కల్పిస్తుంది. చదివిన సంవత్సరం వరకూ క్రెడిట్స్ లెక్కగడతారు.

ఏడాది తర్వాత రెండు సెమిస్టర్లు పూర్తిచేసి ఎగ్జిట్ అయితే యుజి సర్టిఫికెట్, రెండేండ్ల తర్వాత నాలుగు సెమిస్టర్లు పూర్తి చేసి ఎగ్జిట్ అయితే యుజి డిప్లొమా, మూడేళ్లలో ఆరు సెమిస్టర్లు పూర్తిచేస్తే విద్యార్థి క్రెడిట్స్‌ను బట్టి డిగ్రీ, నాలుగేండ్లల్లో 8 సెమిస్టర్లు పూర్తిచేస్తే ఆనర్స్ డిగ్రీని జారీ చేస్తారు. యుజి సర్టిఫికెట్‌కు 40, యుజి డిప్లొమాకు 80, మూడేళ్ల డిగ్రీకి 120, నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీకి 160 క్రెడిట్స్ పొందాల్సి ఉంటుంది. 75 శాతం కన్నా అధిక మార్కులు పొందిన విద్యార్థులు ఆనర్స్ విత్ రీసెర్చ్‌కు అర్హులు. వీరు రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు 12 క్రెడిట్స్‌ను అదనంగా పొంది ఉండాలి. విద్యార్థులు ఒక విద్యాసంస్థ నుంచి మరో విద్యాసంస్థకు సులభంగా మారవచ్చు.

90 రోజులకు ఒక సెమిస్టర్

డిగ్రీలో 90 రోజులకు ఒక సెమిస్టర్ చొప్పున, ఒక విద్యాసంవత్సరంలో రెండు సెమిస్టర్లు పూర్తి చేయాల్సి ఉంటుందని యుజిసి మార్గదర్శకాల్లో పేర్కొంది. నాలుగేళ్ల డిగ్రీకి 160 క్రెడిట్స్‌ను ఇస్తారు. 160 క్రెడిట్స్ పొందిన వారికి ఆనర్స్ డిగ్రీ వస్తుంది. మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం క్రెడిట్స్‌ను దక్కించుకుంటే మేజర్ డిగ్రీ, 12 క్రెడిట్స్ దక్కించుకుంటే మైనర్ డిగ్రీ ఇవ్వాలని తెలిపింది. విద్యార్థుల ఇష్టం మేరకు అన్ని రకాలైన కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పించింది. ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు సులభంగా మారేందుకు అవకాశం ఇచ్చింది. మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్‌కు అవకాశం కల్పిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News