Sunday, December 22, 2024

ఒకేసారి రెండు డిగ్రీల విధానానికి యుజిసి అనుమతి

- Advertisement -
- Advertisement -

UGC approval for two degree policy at once

న్యూఢిల్లీ : ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్టు యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ మంగళవారం ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈసీ)లో భాగంగా విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీలు చేసే వీలుంది. దీనివల్ల విద్యార్థులు అనేక స్కిల్స్ పెంచుకుంటారు. ఒకే యూనివర్శిటీ నుంచి ఒకేసారి రెండు డిగ్రీలు పొందవచ్చు. లేదా వేరువేరు యూనివర్శిటీల నుంచి కూడా రెండు డిగ్రీలు చేయవచ్చు. ఫిజికల్ మోడ్‌తోపాటు ఆన్‌లైన్‌లో కూడా రెండు డిగ్రీలు చదివే వీలుందని జగదీష్ కుమార్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News