Saturday, July 6, 2024

యుజిసి నెట్ పరీక్ష రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మంగళవారంనాడు నిర్వహించిన యుజిసినెట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజె న్సీ (ఎన్‌టిఎ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు గుర్తించామని, పరీక్షలో నిర్వహణలో పారదర్శకతకు కట్టుబడుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని బుధవారంనాడు కేంద్ర విద్యాశాఖ ఒ క ప్రకటనలో పేర్కొంది. అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. అక్రమా లు నిగ్గు తేల్చాలని సైబర్ క్రైమ్ విభాగానికి ఫి ర్యాదు చేసినట్లు వివరించింది. పరీక్షను త్వర లో తిరిగి నిర్వహించనున్నట్లు పేర్కొంది.

పరీక్షల్లో ఎలాంటి అక్రమాలను ఉపేక్షించేది లేద ని కేంద్రం స్పష్టం చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్‌డి అడ్మిషన్ల కోసం 83 సబ్జెక్టులలో మంగళవారం రెండు సెషన్లలో యుజిసి నెట్ పరీక్ష జరిగింది.దేశవ్యాప్తంగా317 నగరాలలో 120 5 పరీక్షా కేంద్రాలలో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 11,21,225 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నెట్ పరీక్షను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించిన ప్రభుత్వం ఈ సారి పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహించిం ది. ఇప్పటికే ఎన్‌టిఎ ఆ ధ్వర్యంలోనే నిర్వహించిన నీట్ పరీక్షపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా నెట్ పరీక్షలోనూ అవకతవకలు వెలుగుచూడడం సంచలనం సృష్టిస్తోం ది. ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News