Monday, December 23, 2024

అందుబాటులోకి యుజిసి కొత్త వెబ్‌సైట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నూతన విద్యావిధానం 2020 కి అనుగుణంగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) యుజిసి కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. యూజర్ ఫ్రండ్లీగా, ఇన్ఫర్మేటివ్‌గా, డైనమిక్‌గా మార్చడానికి రీడిజైన్ చేసింది. మొత్తం సమాచారాన్ని విద్యార్థులు, ఫ్యాకల్టీ, విశ్వవిద్యాలయాల వారీగా వర్గీకరించారు.

ఇది విద్యార్థులు, ఫ్యాకల్టీ అవసరమైన సమాచారాన్ని సులభంగా పొందడంలో సహాయపడుతుంది.హోమ్ పేజీలో కీలక కార్యక్రమాలు, వివిధ రకాల విశ్వవిద్యాలయాల సమాచారం, పథకాల యొక్క ఇ-గవర్నెన్స్ పోర్టల్‌ల సమాచారం ఉంటుంది. యుజిసి నోటీసులు, సర్క్యులర్‌లను సులభంగా పొందేలా వెబ్‌సైట్‌ను రీ డిజైన్ చేసినట్లు యుజిసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.జగదీశ్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News