Wednesday, January 22, 2025

దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు

- Advertisement -
- Advertisement -

UGC releases list of 21 fake universities

ఢిల్లీ టాప్.. రెండో స్థానంలో యుపి
యుజిసి వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో 21 విశ్వవిద్యాలయాలను ”నకిలీ”గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) శుక్రవారం ప్రకటించింది. వీటికి ఎటువంటి డిగ్రీ ఇచ్చే అర్హత లేదని యుజిసి స్పష్టం చేసింది. వీటిలో అత్యధిక యూనివర్సిటీలు ఢిల్లీలో ఉండగా తదుపరి స్థానంలో ఉత్తర్ ప్రదేశ్ ఉంది. యుజిసి చట్టానికి విరుద్ధంగా నడుస్తున్న 21 స్వయం ప్రకటిత, గుర్తింపు పొందని వీటిని నకిలీ యూనివర్సిటీలని, వీటికి ఏ డిగ్రీ అందచేసే అధికారం లేదని యుజిసి కార్యదర్శి రజనీష్ జైన్ తెలిపారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఎడిఆర్-సెంట్రిక్ జురిడికల్ యూనవర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయలను నకిలీలుగా యుజిసి కారదర్శి ప్రకటించారు. అదే విధంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఏడు యూనివర్సిటీలను నకిలీగా ఆయన తెలిపారు. అందులో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలెక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ(ఓపెన్ యూనివర్సిటీ), భారతీయ శిక్ష పరిషద్ ఉన్నాయి. కర్నాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశ, పశ్చిమ బెంగాల్, కేరళలో కూడా నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News