Monday, December 23, 2024

మనసుకు హత్తుకునేలా ‘ఊహలో తేలాల’

- Advertisement -
- Advertisement -

అభయ్ ప్రొడక్షన్స్‌లో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందిన ‘ఊహలో తేలాల’ ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ధనుంజయ్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ సాంగ్‌ను సంగీత దర్శకులు కోటి, ఆర్పీ పట్నాయక్ కలిసి ఆవిష్కరించారు. ఈ సాంగ్ లాంచ్ వేడుకకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం స్వామి నాయుడు, రచయిత లక్ష్మీ భూపాల్, సీనియర్ జర్నలిస్ట్స్ ప్రభు, సుబ్బారావు తదితరులు హాజరై యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభయ్ ప్రొడక్షన్స్ అధినేత ధనుంజయ్ మాట్లాడుతూ.. “ఊహలో తేలాల ఆల్బమ్‌లోని పాటను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించడం జరిగింది. మా డైరెక్టర్ ఫణి గణేష్ అద్భుతంగా ఈ పాటను చిత్రీకరించారు. ప్రముఖ నేపథ్య గాయకులు కారుణ్య, చిన్మయి, యాసిన్ నజీర్ వంటి ప్లే బ్యాక్ సింగర్స్ ఆలపించిన ఆల్బమ్ ఇది”అని తెలిపారు.

Also read: మెట్రోలో డ్రీమ్‌గర్ల్…. ఆటోలో ఇంటికి (వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News