Monday, December 23, 2024

ఉపేంద్ర ‘యూఐ: ది మూవీ’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తన పుట్టినరోజును సెప్టెంబర్ 18న తన అభిమానులందరి మధ్య జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మాస్టర్ స్టోరీ టెల్లర్ బెంగళూరులోని ఊర్వశి థియేటర్‌లో తన అభిమానులను కలుసుకున్నారు. సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ & సలగ విజయ కుమార్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉపేంద్ర మోస్ట్ ఎవైటింగ్ డైరెక్షనల్ ప్రాజెక్ట్ ఉపేంద్ర ‘యూఐ: ది మూవీ’ కోసం మునుపెన్నడూ లేని ఒక ప్రత్యేకమైన టీజర్‌ను లాంచ్ చేశారు. లహరి ఫిలింస్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్, కె పి శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఉపేంద్ర తన డైరెక్షనల్ వెర్సటాలిటీతో చాలా పేరు పొందారు. IMDBలో ప్రపంచంలోని టాప్ 20 ఉత్తమ దర్శకులలో స్థానం సంపాదించుకున్నారు. వీడియోలో ఒక్క ఫ్రేమ్ కూడా విజువల్ లేకుండా సినిమా టీజర్‌ను విడుదల చేయడం ద్వారా తన సృజనాత్మక దృష్టిని మరోసారి ప్రదర్శించారు. ఈ టీజర్ భిమానులను అబ్బురపరిచింది. ఈ టీజర్‌ ని ప్రత్యేకం గా నిలిపిన అంశం ఏమిటంటే.. ఇందులో ఉపేంద్ర ‘యునిక్’ స్టాప్ వుంది. విజువల్ ఫ్రేమ్ లేకుండా డాల్బీ అట్మోస్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ తో కట్టిపడేసింది.

ఈ ఆడియో టీజర్ ఫిల్మ్ మేకింగ్ చరిత్రలో ఒక సంచలనాత్మక అడుగులా నిలిచింది. 3D సౌండ్ ఎఫెక్ట్‌లతో ప్రేక్షకులని ఉత్కంఠతో ముంచెత్తుతుంది. టీజర్ క్లైమాక్స్ లో ‘ఇది ఏఐ వరల్డ్‌ కాదు. ఇది యూఐ వరల్డ్‌. దీని నుంచి తప్పించుకోవాలంటే, మీ తెలివితేటలను వాడండి’’అనే వాయిస్ మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ #‘యూఐ: ది మూవీ’ టీజర్ మాసీవ్  క్రేజ్‌ను తెచ్చింది. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానుంది.

ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో,  రీష్మా నానయ్య హీరోయిన్ గా కనిపిస్తున్నారు. నిధి సుబ్బయ్య, మురళీ శర్మ & పి రవిశంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హెచ్‌సి వేణుగోపాల్ (A & H2O ఫేమ్) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. KGF1&2 ఫేమ్ శివ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ పని చేస్తున్నారు. నిర్మల్ కుమార్ (విక్రాంత్ రోనా ఫేమ్) VFX పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News