- Advertisement -
మోసాన్ని నివారించడానికి ఆధార్ కార్డును అంగీకరించే ముందు ఆన్‌లైన్ ధృవీకరణ
న్యూఢిల్లీ : ఆధార్ కార్డు ప్రతి పౌరునికి అన్ని వేళల్లో ధృవీకరణ కోసం అవసరమవుతోంది. అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సౌకర్యాలు, సేవలను పొందటానికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఈ 12 అంకెల సంఖ్యలు ఆధార్ నంబర్లు కాదని హెచ్చరించింది. గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డును అంగీకరించే ముందు ఆధార్ కార్డ్ మోసాలపై యుఐడిఎఐ హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను పొందేందుకు ఆధార్ చాలా ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా మారింది. పన్నుల నుండి వ్యాక్సిన్‌ల వరకు ప్రతిదీ ఈ గుర్తింపు కార్డుతోనే జరుగుతున్నాయి. ‘మొత్తం 12 అంకెల సంఖ్యలు ఆధార్ కాదు’ అని యుఐడిఎఐ ట్వీట్ చేసింది. గుర్తింపు రుజువుగా అంగీకరించే ముందు ఆధార్‌ను ధృవీకరించాలని సిఫార్సు చేసింది.
- Advertisement -