Wednesday, January 22, 2025

అయోధ్యకు 5 లక్షల లడ్డూలు

- Advertisement -
- Advertisement -

భోపాల్: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య ఆలయానికి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం నుంచి 5 లక్షల లడ్డూలను పంపిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వివేకానంద జయంతిని పురస్కరించి నగరంలోని ఓ పాఠశాలలో జరిగిన నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్ర మంత్రులు సూర్య నమస్కారాలు, యోగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంనుంచి 5లక్షల లడ్డూలను పంపించనున్నట్లు చెప్పారు.నిర్ణయించిన ప్రత్యేక తేదీల్లో అయోధ్య రామమందిరంలో దర్శనం కోసం వివిధ రాష్ట్రాలనుంచి ప్రజలను పంపించడం జరుగుతుందని, కేంద్రం ఈ వివరాలను అందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News