Saturday, December 21, 2024

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

మెదక్ టౌన్: ఆషాడమాసంలో అంగరంగ వైభవంగా జరిగే ఉజ్జయిని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని బోనాల సందర్భంగా ఆదివారం మెదక్ నియోజకవర్గం ప్రజల తరపున మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి యేటా అమ్మవారికి ప్రభుత్వమే స్వయంగా లాంచనంగా పట్టువస్త్రాలు పెట్టి పూజలు జరిపిస్తుందన్నారు. మెదక్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ఉంచడానికి ఆ తల్లి చల్లగా నన్ను నా నియోజకవర్గ పరజలను చల్లగా చూడాలని కోరుకున్నానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News