Wednesday, January 22, 2025

అత్యాచారం?… మహిళను ముక్కలుగా చేసి రెండు రైళ్లలో పడేశాడు…

- Advertisement -
- Advertisement -

భోపాల్: అత్యాచారం చేయబోతే ప్రతిఘటించడంతో సదరు మహిళను చంపేశాడు. అనంతరం మహిళను ముక్కలుగా చేసి రెండు రైళ్లలో వేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఓ మహిళ తన భర్తతో గొడవ పడి ఉజ్జయిని రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. మథుర వెళ్లేందుకు రైలు కోసం ఎదురుచూస్తుండగా పటేల్ అనే వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేశాడు. ఒక సంచిని ఇండోర్- నాగ్దా ఎక్స్‌ప్రెస్, రెండో సంచి ఇండోర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో పడేసి వెళ్లిపోయాడు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ లో కాళ్లు, చేతులు ఒక రైలులో, మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ లో మరో రైలులో మొండం ఉన్నట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఉజ్జయిని రైల్వేస్టేషన్‌లో సంచులు వేసినట్టుగా గుర్తించారు. వెంటనే పటేల్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News