Thursday, January 23, 2025

బ్రిటన్‌లో నెట్‌వర్క్ వైఫల్యం.. అంతర్జాతీయ విమానాలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

లండన్ : అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు కీలకమైన బ్రిటన్‌లో విమానాల రాకపోకలకు సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. యుకె ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు సిస్టమ్స్‌లో వైఫల్యం ఏర్పడటంతో విస్తృత స్థాయిలో నెట్‌వర్క్ దెబ్బతింది. దీనితో లండన్ ఇతర విమానాశ్రయాలలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారానికి సమయం పడుతుందని, అంతవరకూ భారీ స్థాయిలోనే అంతర్జాతీయ విమానాల రాకపోకలలో జాప్యం ఏర్పడుతుందని బ్రిటన్ పౌరవిమానయాన సంస్థ సోమవారం తెలిపింది. అమెరికా ఇతర దేశాలకు అంతర్జాతీయ విమానాలు ఎక్కువగా లండన్ విమానాశ్రయం

నుంచే వెళ్లుతుంటాయి. దీనితో ఇక్కడి హిత్రో విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. స్థానిక సమన్వయంతో స్కాట్లాండ్ అంతర్గత విమానాలు సవ్యంగానే నడుస్తాయని ఆశిస్తున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఉత్తర, దక్షిణ, అంతర్జాతీయ విమానాల విషయంలో స్పల్ప అంతరాయాలు ఉంటాయని బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (నాట్స్) ప్రతినిధి తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో అంతర్జాతీయ విమానాల ప్రయాణికులు లండన్ మీదుగా వెళ్లుతున్నట్లు అయితే ఎప్పటికప్పుడూ షెడ్యూల్‌ను పరిశీలించుకోవల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News