Thursday, January 23, 2025

పాక్ ఎన్‌ఎస్‌ఎ పర్యటనను రద్దు చేసిన బ్రిటన్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ లండన్ పర్యటనను బ్రిటన్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న సైనిక దాడి పట్ల పాకిస్తాన్ అవలంబిస్తున్న వైఖరే ఇందుకు కారణంగా భావిస్తున్నట్లు ది న్యూస్ ఇంటర్నేషనల్ వార్తాపత్రిక శనివారం వెల్లడించింది. వచ్చే వారం యూసుఫ్ బ్రిటన్‌ను సందర్శించవలసి ఉంది. అయితే ఎటువంటి కారణం తెలియచేయకుండా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పట్ల పాకిస్తాన్ వైఖరే ఇందుకు కారణమని పత్రిక తెలిపింది. కాగా..ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండించడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్వహించే ప్రత్యేక సమావేశంలో తీర్మానానికి మద్దతు తెలియచేయాలని పలు దేశాలకు చెందిన రాయబారి కార్యాలయాలు పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఎటువంటి కవ్వింపు లేకుండా రష్యా దురాక్రమణకు పాల్పడినట్లు యూరోపియన్ యూనియన్‌లో సభ్య దేశాలైన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలకు చెందిన రాయబారి కార్యాలయాల అధిపతులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయగా పాకిస్తాన్ శుక్రవారం దీన్ని దౌత్యనీతికి విరుద్ధమని, ఆమోదయోగ్యం కాదని ఖండించింది.

UK Calls off Pakistan NSA’s Visit over Ukraine Policy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News