Friday, January 10, 2025

ఓయూ విసితో యుకె కార్డిఫ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల భేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యునైటెడ్ కింగ్ డమ్ కార్డిఫ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ తో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధనలు, కోర్సులు, యూనివర్సిటీ ప్రతిష్టను ప్రొఫెసర్ రవిందర్ వివరించారు. ప్రతిష్టాత్మకమైన విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. వేల్స్ విశ్వవిద్యాలయం, కార్డిఫ్ విశ్వవిద్యాలయంతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న రెండు రోజుల అంతర్జాతీయ కార్యశాలలో హాజరయ్యేందుకు వచ్చిన యూకె అధ్యాపకులు వైద్య పరికరాల డిజైనర్, ప్రొఫెసర్ డొమినిక్ ఎగ్ బీర్, సర్జికల్ డిజైనర్ డాక్టర్ ఎమిలీ బిల్ బ్లి, సీనియర్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ కెటి బెవర్లీ విసిని కలిసిన వారిలో ఉన్నారు.

ఇంజీనిరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, సిపిడిడిఎ ఎం అదనపు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్. శివరామ కృష్ణ ఈ బృందాన్ని సమన్వయం చేశారు. సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్ అండ్ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఉస్మానియా యూనివర్శిటీ, కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీ, కస్టమ్ పరికరాల డిజైన్ & సంకలిత తయారీపై రెండు రోజుల అంతర్జాతీయ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. కార్డిఫ్ విశ్వవిద్యాలయం నుండి వచ్చే ఇన్‌పుట్‌లు రెండు విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులకు ప్రయోజనకరంగా ఉండటం పట్ల ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రెండు రోజుల్లో కార్యశాలలో తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో ఇరు పక్షాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని ఆయనన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News