Tuesday, January 21, 2025

యువతిపై కర్కశదాడి.. హైదరబాదీ యువకుడికి లండన్‌లో 16 ఏండ్ల జైలు

- Advertisement -
- Advertisement -

బ్రిటన్‌లో ఓ పాతికేళ్ల భారతీయ యువకుడు , హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ్ అంబర్లాకు 16 సంవత్సరాల జైలుశిక్ష పడింది. స్థానిక ఈస్ట్ లండన్ కోర్టు తీర్పు వెలువరించింది. భారతీయురాలైన తన ప్రేయసి సోనా బిజూను ఈ వ్యక్తి రెండేళ్ల క్రితం కత్తితో పలుమార్లు పొడిచి , అత్యంత కిరాతకంగా చంపడానికి యత్నించాడని సాక్షాధారాలతో ప్రాసిక్యూషన్ నిరూపించింది. ఈస్ట్ లండన్‌లోని ఓ హైదరాబాద్ వాలా రెస్టారెంట్‌లో ఈ యువతిపై యువకుడు దాడికి దిగాడు. ఘటనాస్థలిలోనే ఈ యువకుడిని పట్టుకున్నారు. మై లండన్ పత్రికలో ఈ యువకుడికి జైలుశిక్ష వార్తను ప్రచురించారు. తాను నేరానికి పాల్పడినట్లు ఈ వ్యక్తి ఓల్డ్ బెయిలీ కోర్టులో గురువారం అంగీకరించాడు. దీనితో నేరం పూర్తి స్థాయిలో నిర్థారణ అయింది.

కేరళకు చెందిన అమ్మాయి, ఈ యువకుడు యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌లో 2022 లో విద్యార్థులుగా చేరారు.వీరికి హైదరాబాద్‌లో ఓ కాలేజీలో చదువుకున్నప్పుడు పరిచయం ఏర్పడింది. 2017 నుంచి వీరి మధ్య సంబంధం ఉంటూ వచ్చింది. అయితే ఈ యువకుడి విపరీత చర్యలతో ఆమె ఆయనకు దూరం అయింది. తరువాత వీరు లండన్‌లో కలిశారు. అప్పటి నుంచి ఈ యువకుడు ఆమెను పలు రకాలుగా వేధిస్తూ , పలుసార్లు భౌతికదాడులకు దిగుతూ అదే సంవత్సరం మార్చిలో రెస్టారెంట్‌లో కత్తితో దాడికి దిగాడు. ఈ యువతి తన పిజి కోర్సు పూర్తి చేసుకుని రెస్టారెంట్‌లో పార్ట్‌టైం వెయిట్రెస్‌గా చేరింది. ఆమెను వెంబడిస్తూనే ఉన్న యువకుడు ఆమెను చంపేయడానికి యత్నించాడు. ఈ యువకుడు ఈర్షాద్వేషపరుడు. మారణాయుధాలతో సంచరించి యువతిని చంపేయాలనే ఫక్కా ఆలోచనతోనే దాడికి దిగాడని జడ్జి కట్జ్ తమ తీర్పులో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News