Sunday, December 29, 2024

స్పోర్ట్ షూ వేసుకుందని ఉద్యోగిని తొలగింపు

- Advertisement -
- Advertisement -

కొత్తగా చేరిన ఒక ఉద్యోగిని స్పోర్ట్ షూ వేసుకుని ఆఫీసుకు వచ్చింది. ఇది గమనించిన ఆమె బాస్ సీరియస్ అయ్యాడు. డ్రెస్ కోడ్ పాటించలేదనే కారణంతో సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీనిపై బాధితురాలు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా సంస్థ తీరుపై మండిపడిన ట్రైబ్యునల్ ఆమెకు ఏకంగా 30 వేల పౌండ్లు (సుమారు రూ. 32 లక్షలు) పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. చిన్న కారణాలకే ఉద్యోగంలో నుంచి తొలగించడం సరి కాదని ట్రైబ్యునల్ హితవు పలికింది. 2022లో లండన్‌కు చెందిన ఎలిజబెత్ బెనాస్సీ అనే యువతి మ్యాక్సిమస్ యుకె సర్వీసెస్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది.

కొన్ని రోజుల తరువాత బెనాస్సీ ఒక సారి స్పోర్ట్ షూ వేసుకుని ఆఫీస్‌కు వెళ్లింది. దీనిపై బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారని, డ్రెస్ కోడ్ పాటించాలనే విషయం తెలియదా అంటూ పరుష వ్యాఖ్యలు చేశారని ఆమె వాపోయింది. ఆపై తనను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారని ఆమె తెలిపింది. ఎటువంటి నోటీసూ లేకుండా, అకస్మాత్తుగా ఉద్యోగంలో నుంచి తీసేయడం అన్యాయమని అంటూ ఆమె ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. సుదీర్ఘంగా విచారించిన ట్రైబ్యునల్ తాజాగా తీర్పు వెలువరిస్తూ మ్యాక్సిమస్ యుకె సర్వీసెస్ కంపెనీ తీరు సరి కాదని వ్యాఖ్యానించింది. సంస్థకు ట్రైబ్యునల్ భారీ మొత్తంలో జరిమానా విధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News