Monday, December 23, 2024

గోవాలో నా జాగాలు కబ్జా.. న్యాయం చేయండి

- Advertisement -
- Advertisement -

UK Home Secretary Father complains of goa properties

బ్రిటన్ హోం మంత్రి తండ్రి ఫిర్యాదు

పనాజీ : గోవాలోని తమ ఆస్తిని ఆక్రమించారని బ్రిటన్ హోంమంత్రి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. బ్రిటన్‌లో కొత్త ప్రధాని లిజ్ ట్రస్ సారధ్యంలో కొత్త హోం మంత్రిగా భారతీయ సంతతికి చెందిన మహిళ సూవెల్లా బ్రెవెర్మన్ నియమితులు అయ్యారు. ఆమె తండ్రి క్రిస్టి ఫెర్నాండెజ్ తనకు చెందిన పూర్వీకుల స్థలాలు రెండు కలిపి దాదాపు 13,900 చదరపు మీటర్ల వరకూ గోవాలోని అస్సాగోలో కొందరు కబ్జా చేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఆస్తులను ఆక్రమించారని తెలియచేసుకున్నారు. బ్రిటన్ హోం మంత్రి తండ్రి ఆస్తి అని తెలిసిన మరుక్షణం గోవా ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేసిందని అధికారులు శనివారం తెలిపారు. నార్త్ గోవాలో ఈ ఘరానా కబ్జాకు పాల్పడ్డారు. మొత్తం 13,00 చదరపు గజాల స్థలం కావడంతో దీని విలువ భారీగానే ఉంటుందని వెల్లడైంది.

ఈ ఫిర్యాదు తాము చేపట్టిన దర్యాప్తు వివరాలను స్థానిక సిట్ ఎస్‌పి నిధి వాసన్ విలేకరులకు తెలియచేశారు. తాము ఎఫ్‌ఐఆర్ నమోదుచేశామని దర్యాప్తు వేగవంతం అయిందని వివరించారు. అస్సాగో గ్రామంలో తనకు తన కుటుంబ సభ్యులకు సర్వే నెంబర్లు 253/3, 252/3లో రెండు స్థలాలు ఉన్నాయని, అయితే గుర్తు తెలియని వ్యక్తులు పవర్‌ఆఫ్ అటార్నీ పేరిట వీటిపై ఇన్వెంటరీ ప్రోసిడింగ్స్‌కు దిగారని, ఈ కబ్జాదారుల నుంచి తమ స్థలాలను తమకు అప్పగించాలని ఫెర్నాండెజ్ కోరారు. ఫెర్నాండెజ్ తమ సమస్యను ఫిర్యాదు రూపంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు, రాష్ట్ర డిజిపి జస్పాల్ సింగ్‌కు , గోవా ఎన్నారై కమిషనరేట్‌కు ఇ మొయిల్ ద్వారా పంపించారు. తమకు సంబంధిత ఫిర్యాదు గత వారం అందిందని, వ్యవహారంపై తాము నేరుగా దర్యాప్తు జరిపించే అధికారం లేనందున తాము దీనిని రాష్ట్ర హోం శాఖకు పంపించామని గోవా ఎన్నారై కమిషనర్ నరేంద్ర సవాయికర్ వార్తాసంస్థకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News