Wednesday, January 22, 2025

అక్షత టాక్స్ లీక్‌పై అంతర్గత దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

UK inquiry launched into Akshata Murty's tax leak

 

లండన్ : బ్రిటన్‌లో అక్షత మూర్తి పన్నుల వ్యవహారాల లీక్‌పై అక్కడి ప్రభుత్వం అంతర్గత దర్యాప్తునకు ఆదేశించింది. దేశ ఆర్థిక మంత్రి రిషి సునాక్ భార్య , భారతీయురాలు అయిన అక్షత మూర్తి పన్నుల ఎగవేత అంశం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆమె టాక్స్‌ల విషయం పత్రికలకు ఏ విధంగా అందిందనే విషయంపై దర్యాప్తు జరుగుతుంది. అయితే ఇది ప్రభుత్వ అంతర్గత దర్యాప్తుగానే ఉంటుంది. ఆమెకు ఉన్న దేశీయేతర హోదా , సంబంధిత పన్నుల విషయం పూర్తిగా అంతర్గతంగా ఉంది. అయితే ఇది ఇండిపెండెంట్ పత్రికకు ఎలా చేరిందనేది విచారణలో రాబడుతారు. ఓ ప్రైవేటు వ్యక్తి సంబంధిత పన్నుల హోదా ఇతర వివరాలు వెల్లడించడం చట్టపరంగా శిక్షార్హమైన నేరం అవుతుందని , ఇది ఏ విధంగా లీక్ అయిందనేది ఇప్పుడు రాబడుతారని అధికార వర్గాలు తెలిపాయి. తమకు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి ద్వారా పన్నుల వ్యవహారం తెలిసిందని పత్రిక తమ వార్తకు ప్రాతిపదికను తెలిపింది. ఈ సీనియర్ అధికారి ఎవరు? ఎందుకు సమాచారం లీక్ చేశారనేది దర్యాప్తు క్రమంలో వెల్లడి కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News