Monday, December 23, 2024

భార్యను కత్తితో పొడిచి 200 ముక్కలు చేసిన కిరాతక భర్త

- Advertisement -
- Advertisement -

బాసింగ్హామ్: యూకెలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్యను 200 ముక్కలుగా నరికి చంపేశాడు. తర్వాత తన వంట గదిలో పదిల పరిచి, చివరికి తన స్నేహితుడి సాయంతో నదిలో పడేశాడు. కాగా నికోలస్ మెట్సన్ తన నేరాన్ని శుక్రవారం ఒప్పుకున్నాడు.  అతడు తన భార్యను మార్చి నెలలో హత్య చేశాడు. తన భార్య శరీరపు ముక్కలు పడేయడానికి తన స్నేహితుడు హోలి బ్రేమ్లీ కి 50 పౌండ్లు ఇచ్చినట్లు తెలిపాడు.

వారి వైవాహిక జీవితం కేవలం 16 నెలలే కొనసాగింది. నికోలస్ మెట్సన్ ప్రవర్తన పెంపుడు జంతువుల పట్ల కూడా క్రూరంగా ఉండేదని తెలిసింది. ఈ వివరాలను ‘డైలీ మెయిల్’ పేర్కొంది. పోలీసులు అతడి ఇంటికి దర్యాప్తుకు వెళ్లగా తన భార్య ‘బెడ్ కింద దాక్కుంది’ అన్నాడు. పరిశోధనలో ప్లాస్టిక్ బ్యాగులు నదిలో తేలియాడుతూ  కాలినడకన వెళుతున్న ఓ  వ్యక్తికి కనిపించింది. పోలీసులు అమ్మోనియా కంపు, నేలపైన రక్తపు మరకలు గుర్తించారు. పోలీసు డైవర్లు నదిలో 224 శరీరపు ముక్కలను కనుగొన్నారు. హత్య బెడ్ రూమ్ లోనే జరిగినట్లు నిర్ధారణ అయింది. తర్వాత బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి ముక్కలు చేయడం జరిగిందని తెలిసింది.

తన ఫ్లాట్  నుంచి మెట్సన్ బ్యాగులను తరలిస్తున్న దృశ్యం  సిసిటివి ఫుటేజ్ లో రికార్డయింది. కాగా మృతురాలి తల్లి ‘ఆ పాశవిక హత్యతో తమ కుటుంబం ఊహించనంత బాధను అనుభవిస్తోంది’ అన్నారు. మెట్సన్ కంట్రోలింగ్ ప్రవర్తన కారణంగానే తమ కూతురిని ఎన్నో ఏళ్లుగా చూడలేకపోయినట్లు కూడా ఆమె తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News