Saturday, November 23, 2024

10 నెలల్లో 43 సార్లు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

UK man tested Covid positive for 10 straight months

బ్రిటన్‌లో ఓ వ్యక్తితో వైరస్ సయ్యాట

లండన్ : బ్రిటన్‌లో 72 సంవత్సరాల ఓ వ్యక్తితో కొవిడ్ చెడుగుడులాడుకుంది. నిను వీడని నీడను నేనే అన్నట్లుగా పది నెలల కాలంలో ఆయనకు కరోనా వస్తూ పోయింది. ఈ పది నెలల్లో ఆయన ఏడుసార్లు ఆసుపత్రిలో చికిత్సకు చేరాల్సి వచ్చింది. పలుసార్లు ఇక తన చావు ఖాయం అనుకుని ఆయన ఏకంగా అంత్యక్రియల ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆత్మీయులు, బంధువులకు వీడ్కోలు కూడా తెలియచేసుకున్నాడు. అయితే కరోనా వస్తూ పోయింది కానీ ప్రాణాలను హరించలేదు. అయితే సుదీర్ఘకాలం కరోనా పట్టి పీడించిన వ్యక్తిగా పరిశోధకుల అధ్యయనంలో ఈ వ్యక్తి అపూర్వ రీతిలో నిలిచాడు. వెస్టర్న్ ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన డావే స్మిత్ రిటైర్డ్ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్. కారణాలు తెలియదు కానీ ఆయనను కరోనా వైరస్ పట్టిపీడిస్తూ పోవడం, పది నెలలలో 43 సార్లు పాజిటివ్ ఫలితం వెలువడటంతో డాక్టర్లు, పరిశోధకులు కూడా కంగుతిన్నారు.

ఇంతకూ వైరస్ క్రమంలో ఉన్న బలహీనత ఏమిటీ? ఇన్నిసార్లు ఈ వ్యక్తికి కరోనా వచ్చిపోవడం వెనుక ఆయనలో ఉన్న బలం బలహీనతలు ఏమిటీ? అనేవి తేలాల్సి ఉంది. తాను వృత్తి నుంచి వైదొలిగి చాలా కాలం అయింది. ఇప్పుడు వచ్చిపడ్డ కరోనాతో ఇక బతుకు మీద కూడా ఆశలు వదులకున్నాను. ఇక ఎప్పుడు అయినా చనిపోయే వారి జాబితాలో చేరినట్లే అనుకున్నాను. కుటుంబ సభ్యులను పిలిపించి , శాంతితో కన్నుమూస్తానని బాధపడకండని చెప్పానని ఆయన బిబిసికి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. ఆయనతో పాటు భార్య లిండా కూడా హోం క్వారంటైన్‌లోనే గడిపింది. పలుసార్లు ఇక మా ఆయన తనకు దూరం అయినట్లుగానే తాను భావించానని చెప్పారు. ఏడాది అంతా నరకం చూశానని అన్నారు.

ఆయన శరీరం అంతా యాక్టివ్ వైరస్

స్మిత్ శరీరం ఇప్పుడు వైరస్ వేదిక అయింది. శరీరం అంతా వైరస్ యాక్టివ్ అయి ఉంది. ఇటువంటి అరుదైన కేసు ఎక్కడా చూడలేదని బ్రిస్టల్ వర్శిటీ అంటువ్యాధుల విభాగం నిపుణులు ఎడ్ మోరన్ తెలిపారు. ఆయన శరీరం చిత్రం, అయితే సోకిన ఈ వైరస్ మరీ విచిత్రం అయింది. శరీరంలోని వైరస్ శాంపుల్స్‌ను వర్శిటీ పరిశోధనలకు పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ వైరస్‌లోని మూలకణాలు ఏమిటీ? పిసిఆర్ టెస్టులలో తరచూ యాక్టివ్‌గా ఎందుకు నమోదు అవుతూ వస్తున్నాయి. వైరస్ దాడి తరువాత సద్దుమణగడం, తిరిగి తలెత్తడం వంటి పరిణామాల అంతరార్థం ఏమిటనేది కనుగొనాల్సి ఉందని మోరన్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News