Monday, December 23, 2024

బ్రిటన్ అంటే చట్టం నుంచి తప్పించుకుని దాక్కునే చోటు కాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బ్రిటన్ అంటే చట్టంనుంచి తప్పించుకుని దాక్కోవడానికి అనువైన చోటు కాదని ఆ దేశ భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి టామ్ టెగెంధట్ అన్నారు.నేరారోపణలను ఎదుర్కొంటున్న వారిని తమ దేశంనుంచి పంపించడానికి న్యాయపరమైన ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని చెప్పారు. భారత్, బ్రిటన్‌లకు నిర్దిష్టమైన న్యాయ ప్రక్రియలున్నాయన్నారు. బ్యాంకు రుణాల ఎగవేతదారులు నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలను భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వాన్ని పదేపదే కోరుతున్న విషయం తెలిసిందే. కోల్‌కతాలో జరిగిన జి20 యాంటీ కరప్షన్ మినిస్టీరియల్ సమావేశంలో పాలొగనడం కోసం టామ్ టుగెంధట్ వచ్చారు.ఆయన ఈ నెల 10నుంచి 12 వరకు మన దేశంలో పర్యటించారు. ఈ సమయంలో ఆయన ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు.

క్రమంలో ఆయన ఓ వార్తాసంస్థకు ఇంటర్వూ ఇచ్చారు. ఇంటర్వూలో భాగంగా ఆ సంస్థ ప్రతినిధి ్ల విజయ్ మాల్య, నీరవ్ మోడీవంటి ఆర్థిక నేరగాళ్ల్లు బ్రిటన్‌లో ఉన్నారని, వారిని భారత దేశానికి పంపించాలని భారత ప్రభుత్వం కోరుతోందని, దీనిపై మీ స్పందన ఏమిటని అడిగారు. దీనికి టామ్ స్పందిస్తూ, చట్టనుంచి తప్పించుకుని దాక్కోవడానికి అనువైన స్థలంగా ఉండాలనే ఉద్దేశం బ్రిటన్‌కు లేదని చెప్పారు. భారత్, బ్రిటన్‌లకు నిర్దిష్టమైన న్యాయప్రక్రియలున్నాయని, వాటిని పాటించడం తప్పనిసరన్నారు. విజయ్ మాల్య దాదాపు రూ.9 వేల కోట్లు బ్యాంకు రుణాలను ఎగవేసి 2016లో బ్రిటన్‌కు పారిపోయారు.అదే విధంగా వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోడీ దాదాపు 2 బిలియన్ డాలర్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడు. ఆయన కూడా బ్రిటన్‌లోనే తలదాచుకున్నారు.ఆయన గత ఏడాది బ్రిటన్ అత్యున్నతస్థాయి న్యాయస్థానంలో న్యాయపోరాటంలో ఓడిపోయారు.

దీంతో ఆయనను భారత్‌కు అప్పగించాలని మన ప్రభుత్వం కోరుతోంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి కదలికా లేదు. కాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో జరిపిన చర్చల గురించి అడగ్గా వివరాలు వెల్లడించడానికి టామ్ నిరాకరించారు. అయితే ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన తమ చర్చలు ప్రధానంగా ఇరు దేశాల భద్రత, ఇరు దేశాల పౌరుల అభివృద్ధిపై దృష్టిపెట్టినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News