Sunday, January 19, 2025

తప్పులు చేశాం.. క్షమించండి: బ్రిటన్ ప్రధాని

- Advertisement -
- Advertisement -

UK PM Liz Truss Apologizes for economic mistake

లండన్: బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది వారాల్లోనే లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో పాటు సొంత పార్టీ సభ్యులనుంచే ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరిణామాల నేపథ్యంలో తొలిసారి స్పందించిన లిజ్‌ట్రస్ ..తాము తప్పులు చేశామని.. అందుకు క్షమించండి అని పేర్కొన్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని, వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కన్సర్వేటివ్ పార్టీ నేతగా కొనసాగుతానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెలలోపు లిజ్ ట్రస్‌పై అవఙశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు స్పందించారు.

‘మేము తప్పులు చేశామని గుర్తించాను. అందుకు నన్ను క్షమించండి. ఇప్పటికే ఆ తప్పులను సరి సుకున్నాను. కొత్త చాన్సలర్ (ఆరిక మంత్రి)ను నియమించా. ఆర్థిక సుస్థిరత, క్రమ శిక్షణను పునరుద్ధరించాం. ఇలాగే ముందుకు వెళ్తూ ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తాం. 2019 మేనిఫెస్టో ఆధారంగా మేం ఎన్నికయ్యాం. వాటిని అమలు చేయాలని భావిస్తున్నాం’ అని లిజ్ ట్రస్ పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామన్న ట్రస్.. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ పరిస్థితులూ ప్రతికూలంగా ఉన్నాయని గుర్తు చేశారు.

ఇటువంటి సమయంలో ఇంధన ప్యాకేజిపైనా దృష్టిపెట్టామన్నారు. గత నెల మినీ బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను కోతలన్నిటినీ దాదాపుగా రద్దు చేస్తున్నట్లు కొత్త ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ప్రకటించిన తర్వాత లిజ్ ట్రస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ప్రధాని లిజ్‌ట్రస్ ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్‌లో సామాన్య ప్రజలతో పాటుగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతలనుంచిచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.దీతో ఈ నెల 24 ఓలగా లిజ్‌ట్రస్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పాలక కన్సర్వేటివ్ పార్టీకి చెందిన దాదాపు 100 మంది ఎంపిలు యోచిస్తున్నట్లు సమాచారం.

UK PM Liz Truss Apologizes for economic mistake

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News