Wednesday, January 22, 2025

స్పీడ్ డ్రైవింగ్ వివాదంలో బ్రిటన్ హోం మంత్రికి క్లీన్‌చిట్

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్ ప్రదాన మంత్రి రిషి సునాక్ తన హోం మంత్రి సువెల్లా బ్రేవర్‌మన్‌కు స్పీడ్ డ్రైవింగ్ వివాదంలో క్లీన్‌చిట్ ఇచ్చారు. ఈ సంఘటనలో ఆమె ఎలాంటి మంత్రిత్వ నిబంధనలను ఉల్లంఘించలేదని, అందుకే ఆమెపై ఎలాంటి దర్యాప్తు చేపట్టబోమని స్పష్టం చేశారు. గత ఏడాది స్పీడ్‌డ్రైవింగ్ చేశారన్న ఆరోపణపై వివాదం చెలరేగింది. తనకు విధించిన జరిమానా, పాయింట్లను సువెల్లా బయటకు తెలియకుండా చేశారన్న విమర్శలు వచ్చాయి. దీనిపై విపక్షాలు స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి. ప్రధాని రిషి సునాక్ బుధవారం దీనిపై స్పందిస్తూ ఈ వ్యవహారం మినిస్టీరియల్ కోడ్ ఉల్లంఘన కిందకు రాదని, అందుకని దర్యాప్తు అవసరం లేదని నిర్ణయించినట్టు ప్రకటించారు.

అయితే ఈ వ్యవహారంపై అసత్యాలు ప్రచారం కాకుండా తగిన విధంగా స్పందించాలని బ్రేవర్‌మన్‌కు సునాక్ సూచించారు. బ్రేవర్‌మన్ గత ఏడాది అటార్నీ జనరల్‌గా ఉన్నప్పుడు లండన్ బయట అతివేగంగా కారును నడిపినందుకు ఫైన్, పాయింట్లు పడ్డాయి. ఈ ఫైన్, పాయింట్లు దాచిపెట్టేందుకు బ్రేవర్‌మన్ ప్రయత్నించారన్న విమర్శలు వచ్చాయి. అధికారులను ఈ విషయంలో సహాయం చేయాలని ఆమె కోరినట్టు మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను బ్రేవర్‌మన్ ఖండించారు. అతివేగంగా కారు నడిపినందుకు పెనాల్టీ కూడా కట్టాలని నిర్ణయించుకున్నానని, ఇందులో తప్పించుకునే ఉద్దేశం లేదని వివరిస్తూ ప్రధానికి లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News