Sunday, November 3, 2024

ధూమపాన నిషేధానికి యుకె పిఎం సునాక్ ప్లాన్

- Advertisement -
- Advertisement -

లండన్ : 15ఏళ్లు, ఆ లోపు వయస్సు ఉన్నవారు ధూమపానం చేయకుండా నిషేధం విధించాలన్న తన ప్లాన్లకు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. ఆ వయో వర్గంవారిపై ధూమపాన నిషేధానికి ఉద్దేశించిన కొత్త బిల్లు కామన్స్ సభలో వోటింగ్‌కు రానున్నది. బ్రిటిష్ ఇండియన్ నేత అయిన రిషి సునాక్ నిరుడు ‘టొబాకో, వేప్స్ బిల్’ను ప్రతిపాదించారు. 15 ఏళ్ల పిల్లలకు వర్తింపజేస్తూ 2009 జనవరి 1 తరువాత జన్మించిన ఎవరికైనా పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని ఒక నేరంగా చేయడం ద్వారా ‘ధూమపానరహిత తరం’ సృష్టించాలన్నది తన కల అని ఆయన ప్రకటించారు.

పార్లమెంట్‌లో బిల్లు ఆమోద ముద్ర పొందినప్పుడు ప్రపంచంలో అత్యంత కఠిన ధూమపాన వ్యతిరేక చట్టాలు కొన్నిటిని అది ప్రవేశపెట్టగలదు. ‘భవిష్యత్తులో పొగతాగే వయస్సును ప్రతిసంవత్సరం ఒక సంవత్సరం వంతున మనం పెంచాలని ప్రతిపాదిస్తున్నా. అంటే ఇప్పుడు 14 ఏళ్లు ఉన్న పిల్లలకు ఎన్నటికీ చట్టబద్ధంగా ఒక సిగరెట్‌ను విక్రయించరన్న మాట. వారు, వారి తరం ధూమపానరహితంగా పెరగగలరు. ఇది పని చేస్తుందని మాకు తెలుసు’ అని సునాక్ గత అక్టోబర్‌లో కన్జర్వేటివ్ పార్టీ మహాసభలో ప్రకటించారు. పార్లమెంట్‌లో బిల్లును ప్రతిపక్షం సమర్థిస్తున్నందున, పాలక పక్షం కన్జర్వేటివ్ ఎంపిలకు బిల్లుపై వోటు వేసేందుకు స్వేచ్ఛ ఉన్నందున బిల్లుకు వ్యతిరేకంగా పడే ఏ టోరీ వోట్లను అయినా ప్రధానిపై పూర్తి తిరుగుబాటుగా పరిగణించకపోవచ్చు.

అయితే, సునాక్‌కు ముందు ప్రధానులుగా ఉన్నలిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్ టోరీల్లోనే బిల్లు వ్యతిరేకులకు నేతృత్వం వహిస్తున్నారు. బిల్లును ‘కన్జర్వేటివ్‌కు విరుద్ధం’ అని ప్రజలకు ఎంచుకునే అవకాశం లేకుండా చేస్తున్నదని అంటే బిల్లుకు వ్యతిరేకంగా వోటు వేయాలని వారు యోచిస్తున్నారు. ‘పొగాకు వినియోగానికి సురక్షిత స్థాయి ఏదీ లేదనేది వాస్తవం. అది నిజంగా హానికరం. అందుకే వచ్చే తరాన్ని కాపాడేండుకు ఇప్పుడు ఈ ముఖ్యమైన చర్య తీసుకుంటున్నాం’ అని యుకె ఆరోగ్య శాఖ మంత్రి విక్టోరియా అట్కిన్స్ తెలిపారు. ‘ఈ బిల్లు వేలాది ప్రాణాలను కాపాడుతుంది. మా ఎన్‌హెచ్‌ఎస్ (జాతీయ ఆరోగ్య సేవ)పై భారాన్ని తగ్గిస్తుంది. యుకె ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది’ అని ఆమె సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News