Thursday, November 14, 2024

హై రిస్క్ థర్డ్ కంట్రీస్ లిస్ట్ నుండి యూకె పాకిస్థాన్‌ను తొలగించింది

- Advertisement -
- Advertisement -

లండన్: యూకె ప్రభుత్వం తన “హై రిస్క్ థర్డ్ కంట్రీస్” జాబితా నుండి పాకిస్తాన్‌ను తొలగించింది.  ఇది సంతృప్తికరమైన మనీ లాండరింగ్ , టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నియంత్రణలను కలిగి ఉన్నట్లు గుర్తించబడిన అధికార పరిధిని కవర్ చేస్తుంది. ఇప్పుడున్న జాబితాలో 26 దేశాలున్నాయి. ముఖ్యంగా ఇరాన్, మయన్మార్, సిరియా, నికరగువా వంటి దేశాలున్నాయి. ఈ సవరణ జాబితాను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ కొత్త జాబితాలో పాకిస్థాన్, నికరగువాలను హై-రిస్క్ దేశాలుగా వర్గీకరించలేదు. ఇకపై పాకిస్థాన్ ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’(ఎఫ్‌ఏటిఎఫ్) కింద పరిగణించడం ఉండదు. ఈ సువార్తను పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ జర్దారీ భుట్టో ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News