Monday, December 23, 2024

లండన్‌లో మరో ఇద్దరికి మంకీపాక్స్ వైరస్

- Advertisement -
- Advertisement -

లండన్: లండన్‌లో ఇద్దరు వ్యక్తులకు మంకీపాక్స్ వైరస్ సోకినట్లు బ్రిటన్ ఆరోగ్య భద్రతా సంస్థ(యుకెహెచ్‌ఎస్‌ఎ) శనివారం నిర్ధారించింది. ఒకే ఇంటికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఈ వైరస్ సోకిందని సంస్థ తెలిపింది. నైజీరియాలో ప్రయాణించి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ సోకినట్లు గత వారం సంస్థ ప్రకటించింది. అయితే..తాజాగా నమోదైన ఈ కేసులు ఎక్కడ నుంచి, ఎవరి ద్వారా సంక్రమించాయో తెలియరావలసి ఉందని సంస్థ పేర్కొంది. మే 7వ తేదీన ప్రకటించిన కేసుతో సంబంధంలేని రెండు మంకీ పాక్స్ కేసులు తాజాగా నమోదైనట్లు సంస్థ డైరెక్టర్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ డాక్టర్ కొలిన్ బ్రౌన్ తెలిపారు. మంకీపాక్స్ వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులకే ఈ వైరస్ సోకుతుందే తప్ప ఇది గాలిలో వ్యాపించే వైరస్ కాదని ఆయన వివరించారు. తాజాగా నమోదైన రెండు కేసులలో ఒక వ్యక్తికి లండన్‌లోని ఎంపీరియల్ కాలేజ్ హెల్త్ ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్టుకు చెందిన సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో చికిత్స అందచేస్తుండగా మరో వ్యక్తికి ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News