Monday, December 23, 2024

బ్రిటన్ ల్యాబ్‌లో ప్రాణాంతక కొవిడ్

- Advertisement -
- Advertisement -

UK scientists created mutant Covid strains in 'high-risk

లండన్ : చైనా లోని వుహాన్ ల్యాబ్ నుంచి వెలువడిన వైరస్ కన్నా ఎక్కువ ప్రాణాంతక వైరస్‌ను బ్రిటన్ శాస్త్రవేత్తలు సృష్టించటం వివాదం రేపింది. లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు ఈ వివాదాస్పద పరీక్షలు చేపట్టారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ నుంచి స్పైక్‌ను తొలగించి , చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ లోకి జొప్పించారు. దాన్ని చిట్టెలుకల్లోకి ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం ఆ ఎలుక పరిస్థితిని ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకొనే వ్యవస్థను తయారు చేయడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఈ వైరస్‌తో దాని తీవ్రతను ఢీకొట్టేలా వ్యాక్సిన్లను , చికిత్సలు అభివృద్ధ్ది చేయవచ్చని వివరిస్తున్నారు. బ్రిటిష్ నిబంధనల మేరకే ఈ పరీక్షలు చేపట్టినట్టు యూనివర్శిటీ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News