Sunday, December 22, 2024

లండన్ థియేటర్‌లో `జవాన్’ గందరగోళం

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది. బాక్సాఫీసు రికార్డులను బద్దలుకొడుతున్న జవాన్ చిత్రంసాపిటివ్ మౌత్ పబ్లిసిటీతో ప్రేక్షకులను రెండవవారం కూడా థియేర్లలోకి రప్పిస్తోంది. అయితే లండన్‌లోని ఒక సినిమా థియేటర్‌లో జవాన్ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. థియేటర్ సిబ్బంది చేసిన తప్పు వల్ల షారుఖ్ అభిమానులు బావురుమనే పరిస్థితి ఏర్పడింది.

లండన్‌లోని వ్యూ సినిమాస్‌లో జవాన్ సినిమా ప్రదర్శన సందర్భంగా ఒక విచిత్ర పరిస్థితి చోటుచేసుకుంది. ఈ చిత్రాన్ని ఆ థియేటర్‌లో వీక్షించిన మేకప్ ఆర్టిస్టు సారా రషీద్ తనకు ఎదురైన వింత అనుభవాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

జవాన్ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చాడాలన్న ఆశతో తాను థియేటర్‌కు వెళ్లినట్లు ఆమె తన వీడియోలో తెలిపారు. అయితే 1 గంట 10 నిమిషాల తర్వాత ఇంటర్వెల్ వచ్చిందని, అప్పటికే విలన్‌ను హీరో చంపేయడంతో ఇక సినిమాలో చెప్పాల్సింది ఏముంటుందని తాను, ఇతర ప్రేక్షకులు ఆశ్చర్యపోయామని ఆమె తెలిపారు. అయితే ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు సినిమా ప్రారంభమైందని ఆమె చెప్పారు.

ఇంతా చేస్తే సినిమా రెండవ భాగాన్ని ముందుగా, మొదటి భాగాన్ని ఇంటర్వెల్ తర్వాత థియేటర్‌లో ప్రదర్శించారని ఆమె వివరించారు. మొత్తానికి సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ తీవ్ర నిరాశ, అసంతృప్తి చెందారని ఆమె చెప్పారు. తమకు చేదు అనుభవాన్ని మిగిల్చినందుకు తమ టిక్కెట్ డబ్బు వాపసు ఇవ్వాలంటూ తామంతా డిమాండు చేసినట్లు ఆమె చెప్పారు.

ఆమె ఇన్‌స్టా వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. దాదాపు 60 లక్షల వ్యూస్, 4.5 లక్షల లైక్స్ సాధించిన ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల రూపంలో హాస్యం పండిస్తున్నారు.

ఇంటర్‌నెట్‌లో నేడు అత్యంత విషాదకరమైన వార్త అంటూ ఒక నెటిజన్ లాఫింగ్ ఇమోజీలతో కామెంట్ చేయగా బాల్యం చూపించకుండా ఏకంగా జవాన్‌నే చూపించేశారు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News