Monday, December 23, 2024

ఒక్క ఉక్రెయిన్ శరణార్థికి ఆశ్రయం ఇస్తే 450 డాలర్లు

- Advertisement -
- Advertisement -

UK to pay Brits $450 to host Ukrainian refugees

లండన్ : ఉక్రెయిన్ నుంచి వచ్చే శరణార్థులు ఎవరికైనా బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. దీనికోసం హోమ్స్‌ఫర్ ఉక్రెయిన్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. బ్రిటన్ వాసులు ఎవరైనా ఉక్రెయిన్ శరణార్థులకు ఇల్లు ఇచ్చి ఆశ్రయం కల్పిస్తే ప్రభుత్వం ప్రతినెలా ఒక్కో శరణార్థికి 450 డాలర్లు చొప్పున చెల్లిస్తుంది. ఈ విషయాన్ని బ్రిటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మిషల్ గోవ్ వెల్లడించారు.

ఈ పథకంలో శరణార్థులకు కనీసం ఆరు నెలల అద్దె లేకుండా ఇల్లు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారి పేర్లను సంబంధిత అధికార వర్గాలవద్ద రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, వ్యాపార సంస్థలు, ఎవరైనా ఇక్కడ నమోదు చేయించుకోవచ్చని వివరించింది. ఉక్రెయిన్ ప్రజలకు 3 వేల వీసాలు జారీ చేసినట్టు యూకే వెల్లడించింది. గురువారం నుంచి ఉక్రెయిన్ నుంచి వచ్చే ప్రజలకు వీసాలు అవసరం లేదని, కేవలం ఆ దేశ పాస్‌పోర్టు ఉంటే చాలని పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రం నుంచి వచ్చే ప్రజలకు వీలైనంత సాయం చేస్తామని యుకె సెక్రటరీ ఆఫ్ స్టేట్ మిషెల్ గోవె వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News