Monday, November 18, 2024

భారత్‌లో బ్రిటన్ వర్శిటీ క్యాంపస్

- Advertisement -
- Advertisement -

బ్రిటన్‌లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం సౌతాంప్టన్ వర్శిటీ భారతదేశంలో తమ తొలి క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు భారతదేశంతో సంబంధిత ఒప్పందం కుదిరింది. ఈ వర్శిటీకి అనుబంధ విద్యాసంస్థగా ఈ పూర్తి స్థాయి సమగ్ర క్యాంపస్ దేశ రాజధాని ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలో నెలకొంటుంది. ఈ మేరకు ఇరు దేశాల విద్యారంగ ప్రతినిధుల మధ్య అంగీకార పత్రాలు (ఎల్‌ఒఐ) ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఈ లెటర్‌ను విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అధికారులు అందించారు.

భారతదేశ విద్యారంగ సమృద్థికి వీలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 అగ్రశ్రేణి వర్శిటీల క్యాంపస్‌లను భారతదేశంలో ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం సంకల్పించింది. యుజిసికి అనుసంధానంగా ఇప్పుడు సౌతాంప్టన్ వర్శిటీ క్యాంపస్ పనిచేస్తుంది. భారత్ బ్రిటన్ మధ్య పలు కీలక రంగాలతో పాటు విద్యారంగ పరస్పర సహకారానికి ఇప్పటి అంగీకార పత్రం , తద్వారా ఇక్కడ నెలకొనే వర్శిటీ క్యాంపస్ మైలురాయి అవుతుందని ఈ నేపథ్యంలో జైశంకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News