Sunday, January 19, 2025

నేటి నుంచి బ్రిటన్ వీసా ఫీజుల పెంపు

- Advertisement -
- Advertisement -

లండన్ : విదేశీయులకు తమ దేశ వీసా ఫీజులను పెంచడానికి బ్రిటన్ ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్ణయం బుధవారం నుంచి అమలు లోకి వస్తుంది. దీంతో ఆరు నెలలు, అంతకంటే తక్కువ వ్యవధి గల పర్యాటక వీసాలపై ఇక నుంచి 15 జీబీపీ (బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్)లు అదనంగా చెల్లించ వలసి ఉంటుంది.

అలాగే విద్యార్థి వీసాల ఫీజు అదనంగా 127 జీబీపీలు పెరుగుతుంది. భారత్ సహా ప్రపంచ దేశాల పౌరులకు ఇకనుంచి బ్రిటన్‌కు వెళ్లడం చాలా భారం కానుంది. ఆరు నెలల విజిట్ వీసా ఫీజు 115 జీబీపీలు, విద్యార్థి వీసా ఫీజు 490 జీబీపీలకు పెరుగుతుంది. విదేశీయుల వీసా ఫీజులతోపాటు జాతీయ ఆరోగ్యసేవకు (నేషనల్ హెల్త్ సర్వీస్) వారు చెల్లించే సర్‌ఛార్జీని పెంచారు. దేశంలోప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వేతనాల పెంపు కారణంగా పడే భారాన్ని దీని ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News