Wednesday, January 22, 2025

తలలో పెన్ను గుచ్చుకొని బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: అయిదేళ్ళ చిన్నారి తలలో పెన్ను చొచ్చుకొని వెళ్ళగా ఖ మ్మం డాక్టర్లు అరుదైన అపరేషన్ చేసి బయటకు తీసినా బాలిక ప్రాణాలు మాత్రం దక్కలేదు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం పట్టణానికి చెందిన ఐదేళ్ల చిన్నారి పెన్నతో ఆడుకుంటూ కింద పడిపోయింది. ఆ సమయంలో పెన్న ఆమె తలలోని బ్రెయిన్‌లో గుచ్చుకుపోయి కోమా లోకి వెళ్లిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటిన ఖమ్మం నగరంలోని కెవిఆర్ అభయ హాస్పిటల్‌కు మంగళవారం అర్ధరాత్రి తీసుకొచ్చారు. చిన్నారిని పరిశీలించిన న్యూరోసర్జన్ డా. ఫరాజ్ ఆపరేషన్ చేసి ఆ పెన్నను తొలగించొచ్చు అని తల్లిదండ్రులకు, వారి బంధువులకు చెప్పారు. ఇందుకు వారు అంగీకరించడంతో బుధవారం దాదాపు 4 గంటల పాటు శ్రమిం చి క్లిష్టతరమైన ఆపరేషన్ చేసి ఆ పెన్నును తొలగించారు. కానీ, ఆ తరువాత కాసేపటికి బాలిక కన్నుమూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News