Monday, January 20, 2025

దీర్ఘ శ్రేణి క్షిపణితో మా భూభాగంపై దాడికి ఉక్రెయిన్‌ను అనుమతిస్తారా?

- Advertisement -
- Advertisement -

అమెరికాకు రష్యా మందలింపు
కీవ్ : యుఎస్ సరఫరా చేసిన దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యా లోపలి లక్షాలపై దాడికి ఉక్రెయిన్‌ను అనుమతించాలన్న యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయాన్ని మాస్కో తీవ్రంగా ఆక్షేపించింది. కొన్ని పాశ్చాత్య మిత్ర దేశాలు అనుమతించడంత కీవ్ నుంచి బెడద ఎదురవుతున్నదని మాస్కో ఆరోపించింది. యుఎస్ విధానంలో బైడెన్ మార్పు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వెయ్యి రోజుల మైలురాయిని చేరుతున్న దశలో ఆ యుద్ధానికి అనిశ్చితమైన, కొత్త కీలక కారణం అవుతోంది.

రష్యన్ బాలిస్టిక్ క్షిపణి ఉత్తర ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఒక నివాస ప్రాంతంపై విరుచుకుపడగా ఇద్దరు పిల్లలతో సహా 11 మంది వ్యక్తులు మరణించారు. మరి 84 మంది గాయపడ్డారు. సోమవారం దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒడెసాలో రెండు అపార్ట్‌మెంట్ బ్లాకులపై మరొక రష్యా క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది హతులయ్యారని, అనేక మంది గాయపడ్డారని ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు ఒలెక్జీ హంచరెంకో ‘టెలిగ్రామ్’లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలియజేశారు. యుఎస్ తయారీ ఆయుధాలతో ఉక్రెయిన్ జరిపే దాడిపై పరిమితులను వాషింగ్టన్ సడలిస్తోందని యుఎస్ అధికారులు ఎపి వార్తా సంస్థతో ఆదివారం చెప్పారు,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News