Friday, December 20, 2024

రష్యా నౌకాదళ కార్యాలయంపై ఉక్రెయిన్ క్షిపణి దాడి

- Advertisement -
- Advertisement -

కీవ్: నల్ల సముద్రంలోని రష్యాకు చెందిన నౌకాదళ ప్రధాన కార్యాలయంపైకి ఉక్రెయిన్ శుక్రవారం పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడింది. కాగా ఈ దాడుల తర్వాత తమ నౌకాదళంలోని ఓ నావికుడి జాడ తెలియడం లేదని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా స్వాధీనం చేసుకున్న స్వెవస్తిపోల్‌లో ఉన్న ఈ భవనంనుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు ఎగసి పడుతున్న దృశ్యాలు సంబంధించిన మీడియా ఫొటోలు , వీడియోలలో కనిపించింది. ఈ దాడిలో తమ నౌకాదళానికి చెందిన ఒక నావికుడు చనిపోయినట్లు మంత్రిత్వ శాఖ తొలుత ప్రకటించింది.

అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి జాడ తెలియడం లేదంటూ పేర్కొంది. కాగా మంటలు ఎగసిపడుతున్న భవనం వెలుపల ఎవరూ గాయపడలేదని, ఇంతకు మించి వివరాలు చెప్పలేనని స్వెస్టిపోల్‌కు రష్యా గవర్నర్‌గా నియమించిన మిఖైల్ రజ్వోఝయేవ్ చెప్పారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. కాగా తాము పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలను విన్నామని స్థానికులు చెప్పారు. కాగా పెద్ద సంఖ్యలో అంబులెన్స్ వాహనాలు భవనం వద్దకు చేరుకున్నాయని, దాదాపు 200 మీటర్ల పరిధిలో క్షిపణి షార్ప్‌నల్స్ చెల్లా చెదరుగా పడి న్నాయని టాస్ వార్తాసంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News