భారీ ఎత్తున మంటలు
మాస్కో: ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యన్ నగరం బెల్గోరడ్‌లో ఉన్న చమురు డిపోపై ఉక్రెయిన్ హెలికాప్టర్లు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో డిపోలో భారీఎత్తున మంటలు చెలరేగా యి. ఇరు దేశాల మధ్‌య యుద్ధం ప్రాంభమైన తర్వాత రష్యా భూభాగంపై ఉక్రెయిన్ గగనతల దాడి చేయడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ఆ ప్రాంత గవర్నర్ గ్లాడ్‌కోవ్ తన టెలిగ్రామ్ చానల్‌లో తెలియజేశారు. ‘ ఉక్రెయిన్ ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్ల దాడి కారణంగా ఈ చమురు డిపోలో మం టలు చెలరేగాయి. రష్యా భూభాగంలో తక్కువ ఎత్తులో పయనిస్తూ ఈ దాడి చేశాయి. ఎటువంటి ప్రాణనష్టం లేదు’ అని పేర్కొన్నారు.అంతకు ముందు అదే ప్రాంతంలోని ఆయుధ డిపోపై ఉక్రెయిన్ బలగాలు దాడి చేసి ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు గాయపడినట్లు గ్లాడ్‌కోవ్ తెలిపారు. డిపో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలను ఖాళీ చే యించినట్లు ఆయన తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మంటలు ప్రా రంభమయ్యాయని, పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు 170 అగ్నిమాపక శకటాలు పోరాడుతున్నాయని అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘ టనపై ఉక్రెయిన్‌నుంచి అధికారిక ధ్రువీకరణ రాలేదు. దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని సైనిక ద ళాల ప్రజా సంబంధాల అధికారి బోధన్ సెన్‌యాక్ చెప్పారు.
పారిపోయిన రష్యా సైన్యాలు!
ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేం ద్రం వద్ద రేడియేషన్ స్థాయిలు పెరిగిపోవడంతో అక్కడినుంచి రష్యా సేనలు పారిపోయినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఉక్రెయిన్ అధికారిక విద్యుత్ కంపెనీ ఎనర్జో ఆటమ్ ఈ వ్యాఖ్యలు చేయ.. దీనిపై ఐక్యరాజ్య సమితి నూక్లియర్ వాచ్‌డాగ్ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజన్సీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచా రం. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించిన కొద్దిరోజులకే రష్యా చెర్నోబిల్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పవర్ ప్లాంట్‌కు అత్యంత సమీపంలోని అటవీ ప్రాంతాల్లో రష్యా కొన్ని కందకాలు తవ్వింది. అయితే ఆ సమయంలో రష్యా సైనికులు అత్యధిక మోతాదులో రేడియేషన్‌కు గురయ్యారని, వారికి రేడియేషన్ సంబంధిత వ్యాధుల ప్రాథమిక లక్షణాలు కనిపించాయని ఎనర్జో ఆటమ్ ఓ అంతర్జాతీయ మీడియాకు తెలిపింది. దీంతో రష్యా వెంటనే అక్కడినుం చి బైటపడేందుకు సిద్ధమై బలగాలను తరలించినట్లు తెలిపిం ది. కాగా ఉక్రెయిన్ వ్యాఖ్యలపై ఇం టర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా మరియుపోల్ నగరంలో చిక్కుకున్న పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెళ్లిన 45 బస్సుల కాన్వాయ్‌ని రష్యా బలగాలు ఆపేశాయి. దీంతో కేవలం 631 మంది మాత్రమే ప్రైవేటు వాహనాల్లో నగరంనుంచి బైటపడినట్లు ప్రభుత్వం తెలిపింది.