Wednesday, January 22, 2025

ఉక్రెయిన్‌లో డ్యామ్ పేల్చివేత (వీడియో)

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్ లోని నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ను మంగళవారం తెల్లవారు జామున పేల్చివేశారు. దీంతో నీటివరద ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. దక్షిణ ఉక్రెయిన్ లోని ఖెర్సాన్‌కు 30 కిమీ దూరం లోని ఈ డ్యామ్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది.

గత కొన్ని నెలలుగా ఈ డ్యామ్ సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. రష్యా దళాలే ఈ డ్యామ్‌ను పేల్చివేశాయని ఉక్రెయిన్ మిలటరీ కమాండ్ ఆరోపించగా, ఇది ఉగ్రదాడి అని రష్యా అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి రెండు గంటల నుంనచి కఖోవ్కా డ్యామ్‌పై వరుసగా దాడులు జరుగుతున్నాయని స్థానిక రష్యా మేయర్ వ్లాదిమిర్ లియోనేటివ్ చెప్పారు. డ్యామ్ పేల్చివేతతో వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని రష్యా అదికారిక మీడియా పేర్కొంది.

నీపర్ నదికి తూర్పుతీరాన ఉన్న మైఖోలావిక, ఓల్హిక, లివొ, టియాంగికా,పోనియాటివ్కా, ఇవానివ్కా, టోకరివ్కా వంటి గ్రామాలను ఖాళీ చేయాలని ఉక్రెయిన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డ్యామ్ ఎత్తు 30 మీటర్లు కాగా, కొన్ని వందల మీటర్ల పొడవు ఉంది. 1956లో కఖోవ్కా జలవిద్యుత్ కేంద్రంలో భాగంగా దీన్ని నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లో 18 క్యూబిక్ కిలోమీటర్ల నీటిని నిల్వ చేసే సామర్ధం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News