Wednesday, December 25, 2024

ఢిల్లీలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను బాయ్‌కాట్‌చేసిన ఉక్రెయిన్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో వచ్చే నెలలో జరగనున్న మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్న దేశాల జాబితాలో తాజాగా ఉక్రెయిన్ చేరింది. రష్యా, బెలారస్‌లకు చెందిన బాక్సర్లు ఉన్నందున టోర్నమెంట్‌ను బాయ్‌కాట్ చేయాలనుకున్నట్లు ఆ దేశం తెలిపింది. పురుషుల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఉక్రెయిన్ పోటీపడబోవడంలేదు.

ఉక్రెయిన్ బాక్సింగ్ సమాఖ్య(ఎఫ్‌బియూ) ఉపాధ్యక్షుడు ఒలేగ్ ఇల్చెంకో ఉక్రెయిన్ వెబ్‌సైట్ ‘సస్పిల్నే స్పోర్ట్’ ద్వారా ‘కబళించిన దేశాల అథ్లెట్లతో ఒకే వేదికపై తమ దేశ బాక్సర్లు పోటీపడరు’ అని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేసి శుక్రవారానికి ఏడాది పూర్తవుతుంది. వ్లాదిమిర్ పుతిన్‌కు మిత్రుడిగా భావించే రష్యన్ అధికారి ఉమర్ క్రెమ్‌లెవ్ నాయకత్వం వహిస్తున్నందున, ఇప్పటికే సమస్యాత్మకమైన అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య రష్యా దండయాత్ర తర్వాత మరిన్ని సమస్యలను ఎదుర్కొంది.

‘మా వైఖరి స్పష్టమైనది. మా అథ్లెట్లు, బాక్సింగ్ ఫెడరేష్ ఆఫ్ ఉక్రెయిన్ ప్రతినిధులు దాడి చేసిన రష్యా, బెలారస్ దేశ ప్రతినిధులతో తలపడరు’ అని ఇల్చెంకో అన్నారు. రష్యా, బెలారస్ బాక్సర్లను చేర్చుకోవడంతో అనేక దేశాలు ఛాంపియన్‌షిప్ నుండి వైదొలిగాయి. ఉక్రెయిన్‌తోపాటు, అమెరికా, బ్రిటన్, స్విట్జార్లాండ్, పోలాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, చెక్ రిపబ్లిక్, స్వీడన్, కెనడా దేశాలు న్యూఢిల్లీలోని కెడి. జాదవ్ స్టేడియంలో మార్చి 15 నుంచి 26 వరకు జరిగే మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి తప్పుకున్నాయి.

భారత బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బుధవారం 74 దేశాల నుండి 350 మందికిపైగా బాక్సర్లు ఈ ఈవెంట్‌లో పాల్గొంటారని, ఇది పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫైయింగ్ ఈవెంట్‌గా రెట్టింపవుతుందని  అంతర్జాతీయ  బాక్సింగ్ సంఘం(ఐబిఎ) తెలిపింది.

IBA

Ukraine boycott

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News