Monday, December 23, 2024

3500మంది రష్యా సైనికులను మట్టుబెట్టాం

- Advertisement -
- Advertisement -

Ukraine claims 3500 Russian Soldiers killed

14 యుద్ధ విమానాలు, 102 యుద్ధ ట్యాంకులు ధ్వంసం
ఉక్రెయిన్ రక్షణమంత్రిత్వ శాఖ ప్రకటన

కీవ్ : రష్యా సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. 14 రష్యా యుద్ధ విమానాలను కూల్చేశామని, 102 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని తెలిపింది. సుమారు 3,500 మంది రష్యన్ దురాక్రమణదారులను మట్టుబెట్టినట్లు పేర్కొంది. ఈ ప్రకటనను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, తమ మిత్ర దేశాల నుంచి ఆయుధాలు, ఇతర పరికరాలు రాబోతున్నట్లు తెలిపారు. యుద్ధ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అంతకుముందు ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్‌తో మాట్లాడారు. ఇదిలావుండగా, ఉక్రెయిన్‌కు 600 మిలియన్ డాలర్లు సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో నాటో దళాన్ని యాక్టివేట్ చేశారు. సైన్యం, వాయు సేన, నావికా దళం దీనిలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News