కీవ్: ఇరాన్ సరఫరా చేసిన సూసైడ్ డ్రోన్‌లను రష్యా తమపై ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా ప్రయోగించిన ఇరాన్ డ్రోన్‌ను కూల్చివేశామని తొలిసారి మంగళవారం ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధరంగంలో ఇరాన్ డ్రోన్‌లను ఉపయోగించడం మాస్కోటెహ్రాన్ మధ్య ఉన్న బంధాన్ని తెలుపుతుందని ఉక్రెయిన్ సైనిక అధికారులు ఆరోపించారు. నిఘావర్గాలు జులైలోనే ఈ విషయంపై బహిరంగ ప్రకటన చేశాయి. బాంబులను మోసుకెళ్లే వందలాది డ్రోన్‌లను టెహ్రాన్ రష్యా పంపేందుకు సన్నాహాలు చేస్తోందని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సహాయం చేసేందుకు డ్రోన్‌లను పంపుతుందని నిఘా అధికారులు తెలిపారు. తొలుత ఇరాన్ ఆ ఆరోపణలను తిరస్కరించింది. అనంతరం తమ దేశ సైన్యం రివల్యూషనరీ గార్డ్ ఇటీవల రోజుల్లో అగ్రదేశాలకు దీటుగా తయారైందని టెహ్రాన్ ప్రకటించింది.కాగా ఉక్రెయిన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో ఇరాన్ డ్రోన్ శకలాల ఫొటోలను ప్రచురించారు. త్రికోణపు ఆకారంలో ఉన్న ఈ డ్రోన్‌ను ఇరాన్ షాహెద్‌గా పేర్కొంటుంది. ఉక్రెయిన్ దళాలు డ్రోన్‌ను కీవ్ మధ్యభాగంలోని కుపియాన్‌స్క్ సమీపంలో అడ్డుకుని కూల్చివేశాయని సైనికాధికారులు ఆర్మీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
Ukraine collapsed Iran drone used by Russia