Friday, November 22, 2024

మాస్కో ఎయిర్‌పోర్ట్ లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడి

- Advertisement -
- Advertisement -

మాస్కో : మాస్కోకు సమీపంలో నగరం లోని రెండో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ లక్షంగా ఉక్రెయిన్ చేపట్టిన డ్రోన్ దాడిని రష్యా బలగాలు భగ్నం చేశాయి. మాస్కోకు 15 కిమీ దూరం లోని సుకొవొ ఎయిర్‌పోర్టు లక్షంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. అయితే మాస్కో శివార్లలో ఎయిర్ డిఫెన్స్ ఈ డ్రోన్‌ను ధ్వంసం చేయడంతో ఎయిర్‌పోర్ట్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. ఉక్రెయిన్‌పై శనివారం రాత్రి రష్యా వైమానిక దాడులు కొనసాగించడంతో కీవ్‌డ్రోన్ దాడికి దిగినట్టు భావిస్తున్నారు.ఇదిలా ఉండగా శనివారం ఉక్రెయిన్ లోని ఖర్కీవ్ ప్రాంతంలో రష్యా దాడుల్లో ఇద్దరు మరణించగా, నలుగురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News