Sunday, January 19, 2025

రష్యా ఎయిర్‌బేస్‌పై ఉక్రెయిన్ దాడి

- Advertisement -
- Advertisement -

రష్యాలోని మోరోజోవిస్క్ సైనిక స్థావరంపై ఉక్రెయిన్ భీకర దాడులకు దిగింది. శుక్రవారం ఉక్రెయిన్ సేనలు, ఎస్‌బియు సెక్యూరిటీ సర్వీసెస్ బలగాలు లిసి సంయుక్తంగా రోస్టోవ్ ప్రాంతంలోని ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడ్డాయని కీవ్ ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఈ అనూహ్య అసాధారణ దాడిలో రష్యాకు చెందిన ఆరు యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. ఇతరత్రా కూడా నష్టం వాటిల్లింది. దాడులు ఎప్పుడు, ఏ రీతిన జరిగాయనేది వెంటనే వెల్లడికాలేదు. అయితే ఉక్రెయిన్ అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహించిన ఈ దాడిలో మరో ఎనిమిది యుద్ధ విమానాలుకూడా ధ్వంసం అయినట్లు వెల్లడైంది.

కాగా రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి స్పందిస్తూ దాడి జరిగిన విషయాన్ని ధృవీకరించారు. అయితే మొత్తం 44 డ్రోన్లను వెంబడించి ధ్వంసం చేశారని , సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని వివరించారు. ఈ ఘటనలో ఓ విద్యుత్ కేంద్రం కూడా దెబ్బతిందని రోస్టోవ్ గవర్నర్ వాసిలీ గోలుబెవ్ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ ప్రస్తుత యుద్ధంలో డ్రోన్లతో పరస్పరం తలపడుతున్న దశ తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరుదేశాల నడుమ యుద్ధం ఇప్పుడు మూడో ఏడాదిలోకి చేరింది. ప్రధానంగా యుద్ధ విమానాలతో విరుచుకుపడటం తగ్గించి ఇప్పుడు నిర్ణీత లక్షాలను ఎంచుకుని డ్రోన్లతో ఇతరత్రా సాంకేతిక పరిజ్ఞానంతో పరస్పర దాడులు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News