- Advertisement -
మాస్కో : రష్యా అధీనం లోని క్రిమియా లోని కెర్చ్ పోర్ట్ సిటీపై ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఒక్కసారిగా 15 క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 13 క్షిపణులను రష్యా కూల్చేయగా, మిగిలినవి లక్షాలను ఛేదించాయి. దీంతో రష్యాకు చెందిన ఓ అత్యాధునిక నౌక ధ్వంసమైనట్టు సమాచారం. ఈ నౌకలో కిల్బిర్ క్షిపణులు ఉన్నట్టు ఉక్రెయిన్ వాయుసేన కమాండర్ మైకొలా ఒలెస్సుక్ వెల్లడించారు. దాదాపు 20 నెలలుగా చేస్తున్న ఈ యుద్ధంలో రష్యా వందల క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. “మరో నౌక మాస్కోవా బాట పట్టింది”అని మైకొలా ఒలెస్సుక్ వ్యాఖ్యానించారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఉక్రెయిన్ దళాలు చేసిన క్షిపణి దాడిలో మాస్కోవా అనే భారీ యుద్ధనౌక మునిగిపోయిన విషయం తెలిసిందే.
- Advertisement -